బాలయ్య కెరీర్లో గుర్తుండిపోయే చిత్రమిది: నాగవంశీ
‘డాకు మహారాజ్’ బాలయ్య కెరీర్లో గుర్తుండిపోయే చిత్రంగా నిలుస్తుందని ఆ సినిమా నిర్మాత నాగవంశీ ధీమా వ్యక్తం చేశారు. ‘‘జనవరి 9న అనంతపురంలో భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేశాం. ‘డాకు మహారాజ్’ సినిమాను తెలుగునాట కావాల్సినన్ని థియేటర్లలో భారీగా విడుదల చేస్తున్నాం. యూఎస్‌లో కూడా భారీ స్థాయిలోనే ఉంటుంది. తెలుగుతో పాటు తమిళ్లోనూ జనవరి 12న విడుదలవుతోంది. ఈ సంక్రాంతికి ఘన విజయం సాధిస్తామనే నమ్మకం ఉంది’’ అన్నారు.