నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య మరింత పెరుగుతోంది. ఈ విపత్తు కారణంగా టిబెట్‌లో ఇప్పటివరకు కనీసం 126 మంది మృత్యువాత పడినట్లు చైనా అధికారిక మీడియా సంస్థ పేర్కొంది. మరో 188 మంది గాయపడినట్లు తెలిపింది. మంగళవారం ఉదయం ఇక్కడ రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే.