AP: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలను ఆసుపత్రుల సంఘం నిలిపివేసింది. పెండింగ్ బకాయిలు ఇస్తేనే సేవలు కొనసాగిస్తామని చెప్పిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం బకాయిలు చెల్లిస్తామని చెప్పినా ఆసుపత్రులు సేవల కొనసాగింపుపై ముందుకు రావడం లేదని తెలుస్తోంది. వైద్య సేవల కొనసాగింపుపై చర్చించి చెబుతామని ఆసుపత్రుల సంఘం తెలిపింది.