టిబెట్‌లోని డింగ్రీ కౌంటీలో సంభవించిన భూకంపంపై బౌద్ధ మత గురువు దలైలామా స్పందించారు. వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం, అనేకమంది గాయపడటం, ఆస్తులు విధ్వంసానికి గురికావడంపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రకృతి విలయంలో ప్రాణాలు కోల్పోయిన వారి కోసం ప్రార్థనలు చేస్తున్నట్లు తెలిపారు. గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.