శ్రీతేజ్ నన్ను గుర్తుపట్టట్లేదు.. తండ్రి ఆవేదన
TG: థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ ఇప్పుడిప్పుడే కళ్లు తెరుస్తూ మూస్తున్నాడని అతడి తండ్రి భాస్కర్ తెలిపారు. కానీ తనను గుర్తుపట్టే స్థితిలో లేడని వాపోయారు. శ్రీతేజ్ కోలుకునేందుకు మరో 2నెలలు పట్టే అవకాశం ఉందని వైద్యులు చెప్పారన్నారు. బన్నీ టీమ్ ఇప్పటివరకు రూ. 10లక్షలు ఇచ్చారని, వైద్యులతో నిత్యం మాట్లాడి ఆరా తీస్తున్నారని వెల్లడించారు. బన్నీపై కేసు వాపసు తీసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు భాస్కర్ చెప్పారు.