ఎమ్మెల్యే చింతమనేని వినూత్న ఆలోచన (వీడియో)

77చూసినవారు
AP: ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వినూత్న ఆలోచన చేశారు. తనకు వివిధ సందర్భాల్లో పార్టీ కార్యకర్తలు, అభిమానులు తెచ్చిన శాలువాలను పడేయకుండా.. అభాగ్యులైన చిన్నారులకు బట్టలు కుట్టించి అందజేశారు. ఒక్కో డ్రెస్సుకు రూ.450 ఖర్చు చేసి హాస్టళ్లు, స్కూళ్లలోని 250 మంది పేద విద్యార్థులకు అందజేశారు. వీఐపీలు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్