అలా చేస్తే అల్లు అర్జున్ బెయిల్ రద్దు: లాయర్

69చూసినవారు
అలా చేస్తే అల్లు అర్జున్ బెయిల్ రద్దు: లాయర్
TG: సంధ్య థియేటర్ తొక్కిసలాటపై పోలీసులు, అల్లు అర్జున్ పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో హైకోర్టుకు బన్నీ తప్పుడు ఆధారాలు సమర్పిస్తే మధ్యంతర బెయిల్ రద్దవుతుందని కాంగ్రెస్ లీగల్ సెల్ వైస్ ఛైర్మన్ తిరుపతి తెలిపారు. నిజాలను నిగ్గు తేల్చేందుకు అల్లు అర్జున్ ను పోలీసులు విచారిస్తున్నారని, అవసరమైతే సీన్ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తారన్నారు. కాగా బన్నీ బెయిల్ రద్దుకు పోలీసులు సుప్రీం కోర్టుని ఆశ్రయించే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్