బీర్పూర్ ఉన్నత పాఠశాలను పరిశీలించిన యువ చైతన్య యూత్ సభ్యులు
బీర్పూర్ గ్రామంలోని హైస్కూల్ లో గత కొన్ని రోజులుగా అనేక ఫిర్యాదులు వస్తున్నాయని బుధవారం యువ చైతన్య యూత్ సభ్యులు పాఠశాలకు వెళ్లి పరిశీలించడం జరిగింది. వివిధ సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకోగా, వారు మధ్యాహ్న భోజనం పై పలు సమస్యలు తెలిపారు. ఈ విషయం గురించి మధ్యాహ్న భోజన కార్మికులను సభ్యులు అడగగా తమకు బిల్లులు రావట్లేదని ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాల్వ హరీష్, తదితరులు పాల్గొన్నారు.