Feb 15, 2025, 17:02 IST/వేములవాడ
వేములవాడ
వేములవాడరూరల్ మండలంలో పంటపొలాలను పరిశీలించిన అధికారులు
Feb 15, 2025, 17:02 IST
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలో యాసంగిలో పదివేల ఎకరాల వరి సాగవుతోందని రూరల్ వ్యవసాయ అధికారిణి వినీత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో మార్పులు ఉన్న తరుణంలో వరి పంటకు అగ్గి తెగులు సోకే అవకాశం ఎక్కువగా ఉందని, రూరల్ మండలంలోని వరి పొలాల్లో అగ్గి తెగులు మొదలవుతుందన్నారు. రైతులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. రూరల్ పరిధిలోని పలు గ్రామాల పంట పొలాలను పరిశీలించారు.