భారీగా గుడుంబా, బెల్లం స్వాధీనం
గంభీరావుపేట మండలం నాగంపేట్, లింగన్నపేట, లక్ష్మీపూర్ తండాలలో ఎక్సైజ్ అధికారులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్టో కారులో తరలిస్తున్న 50 కేజీల బెల్లం, 10 కేజీల పటిక, 5 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకుని, అజ్మీర నాజం అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ సర్కిల్ సీఐ ఎం. శ్రీనివాస్ తెలిపారు. ఈ తనిఖీల్లో కానిస్టేబుల్ రాజు మల్లేష్, కిషోర్, కృష్ణకాంత్, భవానీ పాల్గొన్నారు.