రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం శ్రీగాధ గ్రామ శివారులో ఎస్సై వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తున్న మూడవత్ సురేష్ ఆటోను మంగళవారం పట్టుకొని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ ను తరలించారు. అతనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామ్మోహన్ తెలిపారు. ఎవరైనా ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.