కరీంనగర్ జిల్లా హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మొదటి మహిళాగా గూడూరి రాజేశ్వరి, వైస్ చైర్మన్ నాంపల్లి తిరుపతి నియామకం అయినట్లు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 18 మంది సభ్యులతో కూడిన పాలకవర్గం రెండు సంవత్సరాల పాటు కొనసాగుతొంది. చైర్మన్ రాజేశ్వరి మాట్లాడుతూ.. మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ ఇన్ చార్జ్ ప్రణవ బాబు కు కృతజ్ఞతలు తెలియజేశారు.