ఇల్లంతకుంట మండలంలోని నూర్ భాషా దూదేకుల సమస్యలు పరిష్కరించుకోవాలని మహమ్మద్ సలావోద్దీన్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని వైశ్య భవన్లో నూర్బాషా దూదేకుల సంఘం సమావేశం నిర్వహించారు. సమావేశంలో అధ్యక్షుడు సలావోద్దీన్ మాట్లాడుతూ నూర్ బాషా సంఘం అభివృద్ధికి అందరూ కృషి చేయాలని, అందరి సహకారంతో సంఘం సమస్యలను, ప్రతి గ్రామంలోఉన్న సమస్యలు పరిష్కరించుటకు కృషి చేద్దామాన్నారు. ముఖ్యంగా సంఘం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ సహాయ సహకారాలు చాలా అవసరమన్నారు. ఈ కార్యక్రమంలోప్రధానకార్యదర్శి ఎండీ .ఉష్మాన్, ఉపాధ్యక్షుడు జలీల్, కుల సంఘం నాయకులు భాషూ, కూతుబోద్దిన్, రాజ్ మహ్మద్, సలావోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.