టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాజశేఖర్?
ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే టీడీపీ అభ్యర్థుల్ని సోమవారం ప్రకటించే అవకాశం ఉంది. కృష్ణా, గుంటూరు జిల్లాల అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పేరును టీడీపీ దాదాపు ఖరారు చేసింది. కాగా, ఉభయగోదావరి జిల్లాల అభ్యర్థిగా కోనసీమకు చెందిన పేరాబత్తుల రాజశేఖర్ పేరు వినిపిస్తోంది.