భారత్ -బంగ్లా టెస్ట్ మ్యాచ్ మళ్ళీ ఆలస్యం.. 12 గంటలకు పిచ్‌ పరిశీలన

63చూసినవారు
భారత్ -బంగ్లా టెస్ట్ మ్యాచ్ మళ్ళీ ఆలస్యం.. 12 గంటలకు పిచ్‌ పరిశీలన
భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య రెండో టెస్టు మూడో రోజు ఆట ఆలస్యమవుతోంది. మ్యాచ్‌కు పిచ్‌ సిద్ధంగా ఉందా లేదా? అనే అంశంపై అంపైర్లు పరిశీలించారు. మైదానం తడిగా ఉండటంతో మ్యాచ్‌ను మరికొంత సమయం వాయిదా వేశారు. మధ్యాహ్నం 12 గంటలకు మరోసారి పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నారు. బంగ్లాదేశ్‌ ప్రస్తుత స్కోరు 107/3. హక్(40*), ముష్ఫికర్‌ (6*) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ఆకాశ్‌దీప్‌ 2, అశ్విన్‌ 1 వికెట్‌ పడగొట్టారు.

సంబంధిత పోస్ట్