చెలరేగిన బౌలర్లు.. భారత్ టార్గెట్ ఇదే
భారత బౌలర్లు విజృంభించడంతో ఇంగ్లాండ్ 132 పరుగులకు ఆలౌట్ అయింది. ఆదిలోనే రెండు కీలక వికెట్లు తీసిన అర్ష్‌దీప్ ఇంగ్లాండ్‌ను చావుదెబ్బ కొట్టాడు. బట్లర్ 68 మినహా మిగిలిన బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. హ్యారీ బ్రూక్ 17, ఆర్చర్ 12 తప్ప ఇతర బ్యాటర్లెవరూ కనీసం రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3, అర్ష్‌దీప్, అక్షర్ పటేల్, హార్దిక్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. భారత్ టార్గెట్ 133.