జనవరి 26న రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలో HYD-శంషాబాద్ ఎయిర్ పోర్టుకు నిఘా వర్గాలు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ నెల 30 వరకు ఎయిర్ పోర్ట్లో రెడ్ అలర్ట్ కొనసాగుతుందని తెలిపారు. ఈనెల 30 వరకు ఎయిర్ పోర్ట్కు సందర్శకులు ఎవరు రావద్దని ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా CISF అధికారులు ఎయిర్ పోర్టులో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధాన దారిలో బాంబ్ స్క్వాడ్, డాంగ్ స్క్వాడ్ తనిఖీలు చేపడుతున్నారు.