సుప్రీం తీర్పుకు కట్టుబడి ఎస్సీ వర్గీకరణ వెంటనే అమలు చేయాలని, వర్గీకరణను అడ్డుకుంటే మూల్యం చెల్లించక తప్పదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ హెచ్చరించారు. బుధవారం పెద్దపల్లిలో ఫిబ్రవరి 7న హైదరాబాద్ లో లక్ష డప్పులు, వేలాది గొంతుకలతో తలపెట్టిన కార్యక్రమానికి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కాసిపేట లింగయ్య, బొడిగే శోభ, ఈర్ల స్వరూప పాల్గొన్నారు.