గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మరోసారి సింగర్ అవతారమెత్తారు. తాను నటించిన ‘డాకు మహారాజ్’ చిత్రంలోని పాట పాడి ఉర్రూతలూగించారు. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ‘డాకు మహారాజ్’.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సందర్భంగా అనంతపురంలో విజయోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో బాలయ్య పాట పాడారు.