కుంభమేళా అంటే ఏంటి?

75చూసినవారు
కుంభమేళా అంటే ఏంటి?
హిందూ పురాణాల ప్రకారం అమృతం కోసం దేవతలకు, రాక్షసులకు మధ్య యుద్ధం జరిగింది. దీనికోసం వారు వాసుకి అనే పామును తాడుగా చేసుకొని మంధర పర్వతాన్ని చిలుకుతారు. ఆ పర్వతం నుండి మొదటగా విషం రాగా.. పరమేశ్వరుడు విషాన్ని స్వీకరించి తన కంఠం నందు నిలుపుతాడు. అందుచే శివుడు నీలకంఠుడు అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన అమృతాన్ని అసురులనుంచి రక్షించడానికి శ్రీ మహావిష్ణువు మోహిని అవతారమెత్తుతాడు. రాక్షసుల నుంచి అమృతాన్ని జాగ్రత్తగా కాపాడుతాడు. ఆ సమయంలో అమృత బిందువులు మనదేశంలోని హరిద్వార్, ప్రయాగ్ రాజ్, నాసిక్, ఉజ్జయినిలో పడ్డాయి. ఈ ప్రదేశాల్లోనే కుంభమేళా జరుగుతుంది.

సంబంధిత పోస్ట్