Top 10 viral news 🔥
అచ్చం మనిషిలాగానే పరిగెడుతున్న కోతి (వీడియో)
మానవుల పూర్వీకులు కోతులని అంటుంటారు. ఇది నిజమో, కాదో అనే అనుమానం ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూడాల్సిందే. ఆ వీడియో చూసిన తర్వాత మానవులు కోతుల నుంచే పుట్టారని నమ్మక తప్పదు. ఓ పార్కులో నడుచుకుంటూ వెళ్లిన కోతి దేనినో చూసి అచ్చం మనిషిలాగే పరిగెత్తింది. కాకపోతే, మనుషులు అందుకోలేనంత వేగంతో పరుగులు పెట్టింది. ఆ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.