AP: ఫెంగల్ తుఫాను ప్రభావిత జిల్లాల అధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ సోమవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు తగ్గే వరకు అధికారులంతా ప్రజలకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలన్నారు. ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ఈ మేరకు అధికారులు స్పందిస్తూ.. విద్యుత్ పునరుద్ధరణ పనులు పూర్తి చేస్తామన్నారు.