AP: కోనసీమ జిల్లా రామచంద్రపురంలో జరిగిన కాపు సంఘం వన భోజనాల్లో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాపులపై తీవ్ర విమర్శలు చేశారు. ‘రెడ్డి కులస్తులు కారు కొంటే.. రెడ్డి గారు బ్రహ్మాండమైన కారు కొన్నారంటారు. చౌదరి గారు గొప్ప బిల్డింగ్ కట్టారని చెప్పుకుంటారు. కానీ కాపోడు స్కూటర్‌పై వెళ్తుంటే ఎక్కడి నుంచి కొట్టుకొచ్చావని అంటుంటారు. ఇది కాపులు సిగ్గుపడాల్సిన విషయం.’ అని తోట త్రిమూర్తులు వ్యాఖ్యానించారు.