మాజీ ఎమ్మెల్యే కొడుకు ఇంట్లో చోరీ
గోదావరిఖని మాజీ ఎమ్మెల్యే కుమారుడు సోమవారం ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో ఊరు వెళ్ళాడు.మంగళవారం తిరిగి వచ్చి చూసే సరికి తాళం పగలగొట్టి ఉంది.లోపలి వెళ్లి చూడగా బీరువాలో దాచిన 12 తులాల బంగారం,రూ 50 వేల నగదు కనిపించలేదు. చోరీ జరిగినట్లు నిర్దారించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసాడు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.