కాఫీ పెట్టిన సీఎం చంద్రబాబు (వీడియో)
AP: పల్నాడు జిల్లాలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు యల్లమంద గ్రామంలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ఎస్సీ వర్గానికి చెందిన శారమ్మ ఇంటికి వెళ్లి సీఎం చంద్రబాబు పింఛన్ అందజేశారు. అక్కడి నుంచి ఏడుకొండలు అనే లబ్ధిదారుని ఇంటికి వెళ్లారు. ఏడుకొండలు ఇంట్లో ఆయన స్వయంగా కాఫీ పెట్టారు. ఏడుకొండలు కుటుంబానికి కాఫీ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.