ఘోరం.. డ్రెయిన్‌లో పడి మూడేళ్ల చిన్నారి మృతి (వీడియో)

74చూసినవారు
ఇండోనేషియాలో మనసు చలించే ఘటన చోటుచేసుకుంది. అభంశుభం తెలియని మూడేళ్ల చిన్నారి డ్రెయిన్‌లో పడి మృతి చెందాడు. ఇండోనేషియాలోని సురబయ ప్రాంతంలో వర్షం కురుస్తుండగా ముగ్గురు చిన్నారులు ఆడుకుంటూ బయటకు వచ్చారు. వారిలో ఓ చిన్న బాలుడు అనుకోకుండా డ్రెయిన్‌లో పడిపోయి మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ టీవీలో రికార్డయ్యాయి.

సంబంధిత పోస్ట్