ఘోరం.. చిన్నారికి యాసిడ్ తాగించిన తండ్రి (వీడియో)

66చూసినవారు
AP: ప్రకాశం జిల్లా ఒంగోలు రూరర్‌లో ఘోరం జరిగింది. తనకు పుట్టలేదనే అనుమానంతో ఓ కసాయి తండ్రి 9 నెలల చిన్నారికి యాసిడ్ తాగించాడు. పాడేరుకు చెందిన మువ్వల భాస్కరరావు, లక్ష్మి దంపతులు తమ పిల్లలతో కలిసి పది రోజుల క్రితం రొయ్యల చెరువుల్లో పని చేసేందుకు ఒంగోలు రూరల్ మండలం గుండాయపాలెం వచ్చారు. ఈ క్రమంలో అనుమానంతో తండ్రి ఈ దారుణానికి పాల్పడ్డాడు. చిన్నారిని తల్లి అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్