సిరిసిల్ల: తృటిలో తప్పిన పెను ప్రమాదం
రాజన్న సిరిసిల్ల తంగళ్ళపల్లి మండలం పద్మనగర్ గ్రామ శివారులో ప్రధాన రహదారి పై మూల మలుపు వద్ద తృటిలో పెనుప్రమాదం తప్పింది. అయితే సోమవారం మూల మలుపు వద్ద వేగంగా వెళ్తున్న బొలెరో, అటువైపు నుంచి సిరిసిల్లకు వస్తున్న బెలోనో కారు ఢీ కొట్టాయి. ఈ ప్రమాదంలో బోలేరో వాహనం బోల్తా పడగా, కారు రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.