సిరిసిల్ల: తండ్రి కూతురు ఆత్మహత్యాయత్నం
పురుగు మందు తాగి తండ్రి కూతురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్లో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్ గ్రామానికి చెందిన రైతు కోడి నారాయణ, కూతురు కోడి శిరీష ఇద్దరే ఇంట్లో ఉంటున్నారు. రాత్రి పురుగు మందు తాగారు. గమనించిన బంధువులు ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నానికి కారణాలు తెలియరాలేదు.