రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని శ్రీరాజరాజేశ్వరస్వామివారి ఆలయానికి కార్తీక మాస చివరి సోమవారం సందర్భంగా ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. ముందుగా ధర్మగుండంలో పుణ్య స్నానాలు ఆచరించి, కోడె మొక్కులు చెల్లించుకున్నారు. కార్తీకదీపాలు సైతం వెలిగించి స్వామివారి సేవలో తరించారు.