తిరుపతిలో మరో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
AP: తిరుపతి జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు హైదరాబాద్ వాసులు మృతి చెందారు. రేణిగుంట కుక్కలదొడ్డి వద్ద కారును ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. మృతులు హైదరాబాద్ పటాన్చెరుకు చెందిన సందీప్ (45), అంజలీదేవి (40)గా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.