Top 10 viral news 🔥
AP: కళ్లలోంచి తలలోకి బాణసంచా దూసుకెళ్లి వ్యక్తి మృతి
AP: న్యూ ఇయర్ వేడుకల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విశాఖకు చెందిన శివ అనే వ్యక్తి.. డిసెంబర్ 31న అర్థరాత్రి ఇంటి మేడపై న్యూ ఇయర్ వేడుకలు చేసుకున్నారు. కేక్ కట్ చేసిన అనంతరం క్రాకర్స్ పేల్చుతుండగా గన్‌షాట్ క్రాకర్ సరిగా పేలలేదని దగ్గరికి వెళ్లి చూశాడు. ఒక్కసారిగా క్రాకర్ పేలడంతో శివ కళ్లలోంచి తలలోకి దూసుకెళ్లింది. దీంతో అక్కడికక్కడే శివ మరణించాడు.