దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ శుభవార్త చెప్పింది. ఈ బ్యాంకులో రూ. 3 కోట్ల లోపు ఉండే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీని కల్పిస్తూ రెండు కొత్త పథకాలను ప్రకటించింది. 303 రోజుల మెచ్యూరిటీ పీరియడ్ గల జనరల్ కస్టమర్లకు 7% వడ్డీ ఆఫర్ చేస్తోంది. ఇక రెండోది 506 రోజుల టెన్యూర్ ఎఫ్‌డీ స్కీమ్ ద్వారా 6.70% వడ్డీ అందిస్తోంది. అయితే ఈ కొత్త రెండు పథకాలు జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు PNB తెలిపింది.