మహారాష్ట్రలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నాసిక్ జిల్లా నానాషి గ్రామంలో సురేష్ బోకె(40), గులాబ్ రామచంద్ర వాగ్మారే(35) మధ్య చాలా కాలంగా గొడవలు ఉన్నాయి. ఈ క్రమంలో కొత్త సంవత్సరం రోజున (జనవరి 1) సురేష్ బోకె, అతని కుమారుడు కలిసి.. రామచంద్ర వాగ్మారేను అతి కిరాతకంగా హత్య చేశారు. అనంతరం తలను నరికి తీసుకొని.. గురువారం తండ్రీకొడుకులు ఇద్దరు పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.