ఫుడ్‌ కొరియర్ చేస్తే.. బెదిరించి రూ. కోటికి పైగా కాజేశారు!

85చూసినవారు
ఫుడ్‌ కొరియర్ చేస్తే.. బెదిరించి రూ. కోటికి పైగా కాజేశారు!
ముంబైకు చెందిన 78 ఏళ్ల మహిళ అమెరికాలో ఉన్న తన కుమార్తెకు కొన్ని ఆహార పదార్థాలతో పాటు మరికొన్ని వస్తువులు ఒక కొరియర్‌ సర్వీస్‌ ద్వారా పంపించింది. తర్వాత రోజు ఓ వ్యక్తి ఫోన్ చేసి.. మీరు పంపించిన కొరియర్‌లో గడువు ముగిసిన పాస్‌పోర్ట్‌లు, 2 వేల USD నగదు, ఇతర వస్తువులు ఉన్నట్లు చెప్పాడు. వీడియో కాల్స్‌లో ఉన్నతాధికారుల్లాగా కనిపించి.. మనీలాండరింగ్‌కు పాల్పడుతున్నారంటూ ఆమెను బెదిరించారు. ఆమె బ్యాంకు వివరాలు సేకరించి రూ. కోటికి పైగా స్వాహా చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్