పోలీసులు సాధారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లను బ్రీత్ అనలైజర్ ద్వారా చేస్తారు. రీడింగ్‌ను బట్టి వాహనదారుడు ఆల్కహాల్ లెవెల్‌ను గుర్తిస్తారు. కానీ గుజరాత్‌లోని వడోదరాలో పోలీసులు మందుబాబులను గుర్తించేందుకు వినూత్న పద్ధతిని అవలంబించారు. రోడ్డు మధ్యలో ఉన్న తెల్లటి గీతపై నడిపించి మద్యం తాగాారో లేదో తెలుసుకున్నారు. తెలుపు గీతపై నడిస్తే తాగనట్లు, తడబడితే అంతే. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.