కేబీఆర్‌ పార్కు రహదారి విస్తరణ.. హైకోర్టులో పిటిషన్‌

60చూసినవారు
కేబీఆర్‌ పార్కు రహదారి విస్తరణ.. హైకోర్టులో పిటిషన్‌
TG: హైదరాబాద్‌ KBR పార్కు రహదారి విస్తరణపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. రోడ్డు విస్తరణలో 306 ఇళ్లు, వ్యాపార సముదాయాలు కోల్పోతున్నామని, 100 నుంచి 120 ఫీట్ల వరకు విస్తరణ చేపడుతున్నారని పిటిషనర్లు పేర్కొన్నారు. రహదారికి మరోవైపు ప్రభుత్వ భూమి ఉందని, ఆ వైపు విస్తరణ చేపడితే నష్టం తగ్గుతుందని వారు కోరారు. రోడ్డు విస్తరణపై ఇప్పటికే జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చామని పిటిషనర్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్