ఆనాటి ఉద్యమ స్మృతులను గుర్తు చేసుకున్న కేసీఆర్

50చూసినవారు
ఆనాటి ఉద్యమ స్మృతులను గుర్తు చేసుకున్న కేసీఆర్
తెలంగాణ భవన్ లో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఆనాటి ఉద్యమ స్మృతులను BRS చీఫ్ కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. 'ఉమ్మడి ఏపీలో తెలంగాణ వాళ్లను సీఎం కానీయలేదు. ఉమ్మడి ఏపీలో ముగ్గురు తెలంగాణవాళ్లే సీఎంలు అయ్యారు. తెలంగాణవాడు సీఎం కాగానే ఏదో ఒక గొడవ పెట్టి దించేసేవారు. వ్యూహం లేకపోవడం వల్లే 1969లో ఉద్యమం విఫలమైంది. 2001లో కాదు.. 1999లోనే ఉద్యమం ప్రారంభమైంది. ఉద్యమ రూపాలు గుర్తు చేసుకుంటే ఒళ్లు పులకరిస్తుంది' అని అన్నారు.