ఇవాళ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి

62చూసినవారు
ఇవాళ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి
స్వాతంత్య్ర సమర యోధుల్లో ప్రముఖుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య (జూన్ 2, 1889 - జూన్ 10, 1928). ఆయన గొప్ప నాయకుడు, సాహసికుడు, వక్త, కవి, గాయకుడు. ఆంధ్ర రత్న బిరుదు పొందినవాడు. ఆయన నాయకత్వంలో నడచిన చీరాల పేరాల సమరం సుప్రసిద్ధం. మహాత్మాగాంధీ సూచనలతో ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో పన్నుల నిరాకరణోద్యమానికి శ్రీకారం చుట్టారు. ఇవాళ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి.

సంబంధిత పోస్ట్