మా తాత-నాన్నమ్మ సమాధులకు పెట్టుకుందామని వచ్చాను: మనోజ్
మా తాత నాన్నమ్మ సమాధులకు దండం పెట్టుకుందామని యూనివర్సిటీకి వచ్చానని మంచు మనోజ్ అన్నారు. విద్యార్థుల కోసం ప్రశ్నించినందుకు నన్ను ఇంట్లోకి రానివ్వకుండా చేసి మా అమ్మ బ్రెయిన్ వాష్ చేశారని చెప్పారు. ఢిల్లీ నుంచి బౌన్సర్లను తీసుకొచ్చారని.. రోడ్డు మీద పోలీసుల లాఠీలను రౌడీలు పట్టుకొని తిరుగుతున్నారని అన్నారు. మోహన్ బాబు యూనివర్సిటీలోకి మనోజ్ ను పోలీసులు అనుమతించకపోవడంతో అక్కడ హైటెన్షన్ నెలకొంది.