ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు పొందాలంటే అర్హులకు ఆధార్ తప్పనిసరిగా ఉండాలంటూ గెజిట్ జారీ చేసింది. పథకాల అమలులో పారదర్శకత కోసం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపింది. పథకాలు, రాయితీలు పొందాలంటే ఆధార్ కచ్చితంగా లింక్ చేయాలని ఆదేశించింది. ఆధార్ లేదన్న సాకుతో పథకాలు తిరస్కరించకూడదని, ఆధార్ కోసం దరఖాస్తు తీసుకొని, మూడు నెలల్లో ఆధార్ నెంబరు కేటాయించాలని పేర్కొంది.