రీల్స్ చేసే వారిపై ఉక్కు పాదం మోపాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. ఇకపై రైల్వే ప్రాంగణాల్లో రీల్స్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోనుంది. సోషల్ మీడియా పిచ్చిలో కొందరు ఫేమస్ అవ్వడం కోసం ప్రమాదకరమైన ఫీట్లు చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. వీటిని కట్టడి చేసేందుకు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. అటువంటి వారిని గుర్తించి, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అన్ని రైల్వే జోన్లకు సూచించింది.