అభిమానులపై పవన్ అసహనం (వీడియో)
AP: అభిమానులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. కడప పర్యటనలో భాగంగా శనివారం ఎంపీడీవో జవహర్ బాబును పరామర్శించారు. అనంతరం మీడియాతో సీరియస్గా మాట్లాడుతున్న సమయంలో అభిమానులు ‘ఓజీ.. ఓజీ..’ అంటూ నినాదాలు చేశారు. దాంతో పవన్.. ‘ఏంటయ్యా మీరు.. ఎప్పుడు ఏ స్లోగన్ ఇవ్వాలో మీకు తెలియదు.. పక్కకు రండి.’ అని అసహనం వ్యక్తం చేశారు. కాగా, పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ఓజీ సినిమా వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానుంది.