ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు తెలంగాణ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు చేశారు. ఆస్ట్రేలియాతో మ్యాచులో నితీశ్ కుమర్ రెడ్డి 'పుష్ప' తరహాలో సెలబ్రేషన్స్ ఉద్దేశించి 'ప్రపంచాన్నే ప్రభావితం చేస్తున్న 'పుష్ప' హీరో అల్లు అర్జున్‌ను వేధిస్తూ తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్తానంటే నమ్మేదెలా అబ్బా?' అని ట్వీట్ చేశారు. ఇటీవల తెలంగాణలో జరిగిన పరిణామాలపైనే ఇలా వ్యంగ్యంగా ట్వీట్ చేశారని పలువురు కామెంట్లు చేస్తున్నారు.