టీవీలో న్యూస్ ప్రజెంటేటర్స్ అప్పుడప్పుడూ తడబడడం సహజమే. కొన్నిసార్లు పేర్లు తప్పుగా చెప్పడం, ప్రాంతాలను మార్చి చెప్పడం లాంటివి జరుగుతుంటాయి. అయితే, కొన్ని సున్నితమైన, ముఖ్యమైన అంశాలను చదివేటప్పుడు ఇలాంటి తప్పులు చేస్తే చాలా మరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇదే ఘటన ఆజ్ తక్ టీవీలో జరిగింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణాన్ని ప్రకటిస్తూ, మన్మోహన్‌కి బదులుగా ప్రధాని మోదీ మరణించారు అంటూ ఓ యాంకర్ చదివింది.