రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజ్‌సమాంద్ జిల్లా మేవార్-మార్వార్ సరిహద్దులోని పంజాబ్ మోడ్ వద్ద ఓ ట్రక్కు అదుపుతప్పి 70 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందగా.. క్లీనర్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడిని చికిత్సా నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేపట్టారు.