Top 10 viral news 🔥
పట్నాలో ఏపీ విద్యార్థిని ఆత్మహత్య
బిహార్లోని పట్నాలో ఏపీకి చెందిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)లోని హాస్టల్ రూమ్లో విద్యార్థిని నిన్న రాత్రి ఉరేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సూసైడ్ నోట్ లభించిందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.