అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ సంధ్య హెచ్చరించారు. సోమవారం మధిర పట్టణంలోని రాయపట్నం బ్రిక్స్ కంపెనీ దగ్గర నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఇసుక డంపును తహసిల్దార్ సమక్షంలో సీజ్ చేశారు. అక్రమంగా ఇసుక రవాణా చేసి నిల్వ చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. తహసీల్దార్ ఆదేశాల మేరకు అక్రమంగా నిల్వ ఉన్న ఇసుకను సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.