
ముదిగొండ: పంటలు పరిశీలించిన ఏఓ
ముదిగొండలో ఈదురు గాలులకు కిందకు వాలిన మొక్కజొన్న పంటను వ్యవసాయాధికారి వేణుగోపాల్ సోమవారం పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట నష్టం అంచనావును నమోదు చేసుకున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఆయన తెలిపారు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా చూడాలని రైతులు కోరారు.