పెనుబల్లి మండలం ఎరుగట్ల గ్రామంలో ఐకేపీ ద్వారా సన్న రకం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ విజయ్ కుమార్ ప్రారంభించారు. రైతులు పండించిన సన్న రకం వరి ధాన్యానికి క్వింటాకు రూ. 500 బోనస్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ నీరజ ప్రభాకర్, వైస్ ఛైర్మన్ పాల్గొన్నారు.